నదీ జలాల్లో తెలంగాణ హక్కులపై పోరాడతాం
నదీజలాల్లో తెలంగాణకు దక్కాల్సిన హక్కులపై పార్లమెంట్ వేదికగా బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని పార్టీ పార్లమెంటరీ పక్ష నేత కేఆర్ సురేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడుతామని తేల్చిచెప్పారు.
- తెలంగాణ ప్రయోజనాల కోసం పార్లమెంట్లో కొట్లాడుతాం
- రాష్ట్ర సమస్యలపై గళమెత్తుతాం
- అఖిల పక్ష భేటీ తర్వాత బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత సురేశ్ రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తేతెలంగాణ): నదీజలాల్లో తెలంగాణకు దక్కాల్సిన హక్కులపై పార్లమెంట్ వేదికగా బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని పార్టీ పార్లమెంటరీ పక్ష నేత కేఆర్ సురేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడుతామని తేల్చిచెప్పారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు నిర్వహించనున్న నేపథ్యంలో కేంద్రం ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. దీనికి బీఆర్ఎస్ తరఫున సురేశ్‌రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత మన రాష్ట్ర హక్కులకు విఘాతం కలిగే పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఖరీఫ్‌లో జరిగిన పంట నష్టానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆశించిన సాయం అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
దేశంలో పంట నష్టపోయిన రైతాంగానికి న్యాయం జరిగేలా చట్టం తీసుకురావాలని కేంద్రాన్ని కోరామని వెల్లడించారు. ఫసల్ బీమా యోజన పేపర్లకే పరిమితం అవుతున్నదని, రైతులకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు. రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 16వ ఫైనాన్స్ కమిషన్, రాష్ట్రాలకు నిధుల వాటాపై చర్చ జరగాల్సిన అవసరమున్నదని స్పష్టంచేశారు. తెలంగాణ నుంచి కేంద్రం రూపాయి తీసుకొని, కేవలం 48 పైసలు మాత్రమే తిరిగిస్తున్నదని పేర్కొన్నారు. ఇది సరికాదని, అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిన రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత మోదీ ప్రభుత్వంపై ఉన్నదన్నారు.
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం
నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నదని సురేశ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. లోక్‌సభ సీట్లు తగ్గుతాయేమోనని, పార్లమెంట్లో ప్రాతినిధ్యం కోల్పోవాల్సి వస్తుందని దక్షిణ భారత ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. దీనిపై పార్లమెంట్లో సమగ్రంగా చర్చించాలని కోరారు. సర్‌పై చర్చించాలని, ఓటరు జాబితా నుంచి అనైతికంగా ఏ ఒక్క ఓటరును తొలగించవద్దన్నారు. అర్హులైన ప్రతి భారతీయుడికి ఓటుహక్కు ఉండాల్సిందేనని స్పష్టంచేశారు. దీనిపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

