బెంగళూర్ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు (Karnataka Assembly Elections) టికెట్ల పంపిణీ కాషాయ పార్టీలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. టికెట్లు దక్కకపోవడంతో సీనియర్ నేతలు, రాష్ట్రస్ధాయి నాయకులు పార్టీకి రాజీనామా చేస్తుండగా మాజీ సీఎం జగదీష్ షెట్టార్ బీజేపీని వీడటం ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ఇక కనకపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సోమవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నట్టు కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ వెల్లడించారు. బీజేపీలో అసంతృప్తుల రాజీనామాలు ఆ పార్టీని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం 130 స్ధానాల్లో విజయం సాధిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం వీరప్ప మొయిలీ ధీమా వ్యక్తం చేశారు.
కర్నాటకలో పరాజయంతో కాషాయ పార్టీకి దక్షిణాది ముఖద్వారం ఇక మూసుకుపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక కోలార్ ర్యాలీలో పాల్గొనేందుకు ఆదివారం బెంగళూర్‌కు చేరుకున్న రాహుల్ గాంధీ అక్కడి నుంచి కోలార్ చేరుకున్నారు. కాగా, మే 10న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Read More
Jagadish Shettar | కర్ణాటకలో బీజేపీకి షాక్.. మాజీ సీఎం రాజీనామా