ముంబై: ‘కొడవళ్ల గ్యాంగ్ (koyta gang)’ మరోసారి రెచ్చిపోయింది. కొందరు వ్యక్తులు కొడవళ్లు వంటి కత్తులు చేతపట్టి ఒక మెడికల్ షాష్లోకి ప్రవేశించారు. అక్కడి సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేయడంతోపాటు వారిపై దాడి చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అయ్యింది. మహారాష్ట్రలోని పూణె జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం కొడవళ్లు చేతపట్టుకున్న ఆరుగురు వ్యక్తులు పింప్రి చించ్వాడ్లోని ఒక మెడికల్ షాపులోకి చొరబడ్డారు. అక్కడి సిబ్బందిపై కొడవళ్లతో దాడి చేశారు. వారిని బెదిరించడంతోపాటు ఆ మెడికల్ షాప్‌ను ధ్వంసం చేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. భయాందోళన నుంచి బయటపడిన ఆ మెడికల్ షాపు సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఆ మెడికల్ షాప్‌నకు వెళ్లి విషయం తెలుసుకున్నారు. ఆ షాపులోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. కొడవళ్లు చేతపట్టిన ఆ గ్యాంగ్ మెడికల్ షాప్ సిబ్బందిపై దాడికి ముందు కామ్‌గర్ నగర్ ప్రాంతంలో కొన్ని వాహనాలను ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. తాజా సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు గత నాలుగు నెలల్లో పూణేతోపాటు మహారాష్ట్రలోని పలు చోట్ల కొడవళ్లు వంటి కత్తులు చేతపట్టిన ఇలాంటి ముఠాల దాడులు ఎక్కువయ్యాయి. వందకుపైగా ఇలాంటి కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర అసెంబ్లీలో కూడా సభ్యులు ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీంతో ‘కొడవళ్ల గ్యాంగ్ (koyta gang)’లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పోలీస్ అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ ఈ ముఠాల ఆగడాలు ఆగడం లేదు. తాజాగా జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
🗡️ #Koyta #gang #terror in #Pimpri.
We can see how the owner of the #medicalstore was #attacked and #vandalized the #shop.
They were also seen vandalizing several #vehicles in the area on Friday and Saturday #midnight.
The entire #incident has been caught on #CCTV. pic.twitter.com/AY1Rts3hva
— TodaysVoice24News, Sayed Imran – Editor (@todaysvoice24nz) April 29, 2023