న్యూఢిల్లీ, మే 1: కేంద్ర ప్రభుత్వ ఏరోస్పేస్, రక్షణ రంగ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) 22వ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా కోట రవి శుక్రవారం నియమితులయ్యారు. ఇప్పటిదాకా ఆపరేషన్స్ డైరెక్టర్‌గా ఆయన పనిచేశారు. ఇక ఈ నియామకం తక్షణమే అమల్లోకి రాగా.. 2029 జూన్ 30దాకా లేదా తదుపరి ఆదేశాలు వచ్చేదాకా ఆయన ఈ ఉద్యోగ పదవిలో ఉండనున్నారు. డీకే సునీల్ ఉద్యోగ పదవీ విరమణతో రవి ఆ స్థానంలోకి వచ్చారు.
తేజస్ తేలికపాటి యుద్ధ విమానాల (ఎల్సీఏ) ప్రోగ్రామ్‌తో సుదీర్ఘ అనుబంధం కలిగిన ఆయన.. ‘ఎల్సీఏ మ్యాన్’గా ప్రసిద్ధి పొందారు. ఐఐఎం అహ్మదాబాద్‌లో మెకానికల్ ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ ట్రైనింగ్ పూర్తి చేసిన రవికి.. ఏరోస్పేస్, తయారీ, ఎలక్ట్రానిక్స్ తదితర రంగాలకు చెందిన పరిశ్రమల్లో 30 ఏండ్లకుపైగా ఉన్నత స్థాయిల్లో పనిచేసిన అనుభవం ఉన్నది.