డెహ్రాడూన్: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాకు చెందిన ప్రొఫెసర్ ఉత్తరాఖండ్‌లోని ఓ హోటల్లో అనుమానాస్పదంగా మరణించాడు. (Kolkata Professor Found Dead) చేతి మణికట్టు, గొంతు కోసి ఉన్న మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్శిటీకి చెందిన ఫిలాసఫీ ప్రొఫెసర్ అయిన 44 ఏళ్ల మైనక్ పాల్, ఇద్దరు స్నేహితులతో కలిసి ట్రిప్ కోసం ఉత్తరాఖండ్ వెళ్లాడు. అయితే తన కుమార్తెను మిస్ అవుతున్నానని స్నేహితులతో అన్నాడు. కోల్‌కతాకు తిరిగి వెళ్లిపోతానని వారితో చెప్పాడు. లాల్కువాన్‌లోని ఒక హోటల్లో బస చేశాడు. శనివారం రైలులో కోల్‌కతాకు తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది.
కాగా, శుక్రవారం సాయంత్రం మైనక్ పాల్ మొబైల్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆ హోటల్‌కు ఫోన్ చేశారు. దీంతో సిబ్బంది రూమ్ డోర్ బ్రేక్ చేసి లోనికి వెళ్లారు. బాత్రూమ్లో ఆయన మృతదేహాన్ని చూశారు. చేతులు, మెడపై కత్తి గాయాలతోపాటు నేలపై రక్తాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఆ హాటల్‌కు చేరుకున్నారు. ప్రొఫెసర్ మైనక్ పాల్ సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు ఈ విషయం తెలిసి జాదవ్‌పూర్ యూనివర్శిటీ ప్రొఫెసర్లు, విద్యార్థులు షాక్ అయ్యారు. ప్రొఫెసర్ మైనక్ పాల్ టీచింగ్‌లో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కాలేజీ పూర్వ విద్యార్థి అయిన ఆయన బెంగాల్లో రెండు కాలేజీల్లో పని చేసిన తర్వాత ప్రెసిడెన్సీ యూనివర్శిటీకి టీచర్‌గా తిరిగి వచ్చారని తెలిపారు. 2022లో జాదవ్‌పూర్ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా చేరినట్లు వెల్లడించారు.