కోల్‌కతా : కోల్‌కతాకు చెందిన ఇద్దరు మోడల్స్ మంజూష నియోగి, బిదిషా డీ మజుందార్ వరుసగా ఆత్మహత్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. బిదిషా ఆత్మహత్య చేసుకున్న రెండు రోజులకే మంజూష కూడా సూసైడ్ చేసుకుంది. ఈ ఇద్దరి ఆత్మహత్యలకు సంబంధం ఉంది. అయితే ఆ సంబంధం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
మంజూష ఆత్మహత్యపై ఆమె తల్లి స్పందించారు. మంజూష, బిదిషా కలిసి జీవించాలనుకున్నారు. ఆ ప్రతిపాదనను తన ముందు ఉంచినప్పుడు మంజూషను తీవ్రంగా మందలించినట్లు తల్లి తెలిపింది. పలుమార్లు ఈ విషయంలో గొడవ కూడా జరిగిందని చెప్పింది. బిదిషాతో నిత్యం ఫోన్లో మాట్లాడేదని పేర్కొన్నది. అయితే బిదిషా ఆత్మహత్యతో మంజూష తీవ్ర ఆవేదనకు లోనైందని తల్లి తెలిపింది. ఈ క్రమంలోనే మంజూష కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లి ఓ జాతీయ మీడియాకు తెలిపింది.
తన ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కారని బిదిషా సూసైడ్ నోట్లో పేర్కొన్నది. అవకాశాలు రాకపోవడం, ఆర్థిక సమస్యలతో పాటు ఇతర కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపింది. అయితే బిదిషా బాయ్‌ఫ్రెండ్ వల్లే ఆమె సూసైడ్ చేసుకున్నట్లు ఫ్రెండ్స్ పేర్కొన్నారు. మొత్తానికి బిదిషా, మంజూష ఆత్మహత్యలకు గల కారణాలు తెలియాల్సి ఉంది.