Australia Test Squad : ఇటీవల ఫామ్ లేమితో విమర్శలు ఎదుర్కొంటున్న మార్నస్ లబూషేన్ (Marnus Labuschagne)కు మరో అవకాశం దక్కింది. స్వదేశంలో బంగ్లాదేశ్‌పై తీవ్రంగా నిరాశపరిచిన అతడిపై వేటు వేయాలనే డిమాండ్లు వస్తున్నా సరే సెలెక్టర్లు నమ్మకం ఉంచారు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు లబూషేన్‌ను తీసుకున్నారు. అలానే.. ఓపెనర్‌గా మాథ్యూ రెన్షా చోటు దక్కించుకోగా.. టీ20ల్లో మెరుస్తున్న కూపర్ కొన్నొల్లీకి అవకాశం లభించింది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(WTC 2025-27)లో మరో కీలకమైన సిరీస్ కోసం ఆస్ట్రేలియా స్క్వాడ్‌ను ప్రకటించింది. గత సీజన్ విజేత దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌లకు పటిష్టమైన బృందాన్ని ఎంపిక చేసింది. 2018 తర్వాత తొలిసారి సఫారీ గడ్డపై పర్యటించనున్న ఆసీస్ ఇన్నింగ్స్‌ను ట్రావిస్ హెడ్‌కు జతగా మాథ్యూ రెన్షా ఆరంభించే అవకాశముంది. ఆశ్చర్యంగా మిడిలార్డర్ బ్యాటర్ మార్నస్ లబూషేన్ వేటు తప్పించుకున్నాడు.
How and why has Marnus Labuschagne been retained?@Alex_Malcolm tells us ➡️ https://t.co/GJHEsibUMz pic.twitter.com/9zvvQskg7o
— Cricinfo (@cricinfo) September 7, 2026
స్వదేశంలో ఇటీవల బంగ్లాదేశ్‌పై మూడు ఇన్నింగ్స్‌లో 1, 13, 4 పరుగులతో విమర్శలపాలైన అతడికి చివరి అవకాశంగా స్క్వాడ్‌లోకి తీసుకున్నారు. గత మూడేళ్లుగా.. 41 ఇన్నింగ్స్‌ల్లో ఒక్క శతకం కూడా చేయని లబూషేన్ సఫారీలపై రాణిస్తే సరి. లేదంటే.. అతడి కెరీర్ ప్రమాదంలో పడినట్టే.
Marnus Labuschagne has retained his Test spot for the tour of South Africa despite scores of 1, 31 and 4 in his three innings against Bangladesh pic.twitter.com/e9fEjBWWSe
— Cricinfo (@cricinfo) September 7, 2026
టీ20ల్లో విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడుతున్న కూపర్ కొన్నొల్లీని టెస్టులకు సిద్ధం చేయాలనుకుంటున్న ఆస్ట్రేలియా క్రికెట్ అతడిని సఫారీ సిరీస్‌కు ఎంపిక చేసింది. ఇక బౌలింగ్ యూనిట్లో పెద్దగా మార్పులేమీ చేయలేదు సెలెక్టర్లు. కమిన్స్ నేతృత్వంలోని పేస్ దళంలో స్టార్క్, బొలాండ్, నాసిర్, హేజిల్‌వుడ్ ఉండగా.. లియాన్‌కు తోడుగా కుహ్నేమన్ రెండో స్పిన్నర్‌గా స్క్వాడ్‌లో స్థానం సాధించాడు. డబ్ల్యూటీసీలో కీలకమైన మూడు టెస్టుల సిరీస్ కోసం ఆస్ట్రేలియా అక్టోబర్‌లో దక్షిణాఫ్రికా వెళ్లనుంది. డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ స్టేడియంలో అక్టోబర్ 9వ తేదీన మొదటి మ్యాచ్‌తో సిరీస్ మొదలవ్వనుంది. అక్టోబర్ 18న రెండో మ్యాచ్, 27న మూడో టెస్టులో సఫారీలతో కమిన్స్ సారథ్యంలోని ఆసీస్ తలపడనుంది.
ఆస్ట్రేలియా స్క్వాడ్ : మాథ్యూ రెన్షా, ట్రావిస్ హెడ్, మాథ్యూ కుహ్నేమన్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లిస్, కూపర్ కొన్నొల్లీ, కామెరూన్ గ్రీన్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, హేజిల్‌వుడ్, స్కాట్ బొలాండ్, మైఖేల్ నాసిర్, లియాన్.