మిర్యాలగూడ, సెప్టెంబర్ 07 : శాసనసభకు వెళ్లకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకోవడంతో పాటు ప్రజా ప్రతినిధులపై పోలీసులు అణచివేత ధోరణికి పాల్పడడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మిర్యాలగూడ పట్టణంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులతో ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యతిరేక వైఖరికి నిరసనగా పట్టణ వీధుల గుండా భారీ ర్యాలీగా బయల్దేరారు. అనంతరం మిర్యాలగూడ బస్టాండ్ కూడలి వద్దకు చేరుకుని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భాస్కర్‌రావు మాట్లాడుతూ ప్రతిపక్షాల గొంతు వొక్కేందుకు ప్రభుత్వం అక్రమ అరెస్టులు, పోలీసుల అణచివేత చర్యలను ఆశ్రయిస్తోందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా తమ సమస్యలపై నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రజాప్రతినిధులకు ఉందని, వారిని సభకు వెళ్లకుండా నిరోధించడం సభా హక్కుల ఉల్లంఘనే అవుతుందన్నారు.
ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు భయపడేది లేదని, ప్రతిపక్షాల హక్కులను కాపాడుకోవడానికి మరియు ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసన కారణంగా ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో కాసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహరెడ్డి, నాయకులు చింతరెడ్డి శ్రీనివాస్‌డ్డి, ఎడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, అన్నబీమోజు నాగార్జునచారి, ఎండి.ఇలియాఖాన్, ధనావత్ చిట్టిబాబునాయక్, ఎండి. మగ్దుంపాషా, ఎండి. మాజీద్, పద్మశెట్టి కోటేశ్వర్రావు, గంగుల భిక్షం, రావూరి సుధాకర్, చంద్రశేఖర్‌రావు, రవి, దుర్గాప్రసాద్, మట్టపల్లి సైదులుయాదవ్, ఎండి.షోయబ్, యర్రమల్ల దినేష్, చౌగాని బిక్షంగౌడ్, శ్రీనివాస్ రెడ్డి, జానయ్య, జక్క నాగేశ్వరరావు, సూర్యనాయక్, ధనావత్ వెంకటేశ్వర్లునాయక్, పిసికె ప్రసాద్, రమణ, నరసింహారెడ్డి, జగదీష్, వింజం శ్రీధర్, పెండ్యాల పద్మ, కోదాటి రమా, షహనాజ్ బేగం, పెరుమాళ్ళ ధనమ్మ, లలిత, శ్రీనునాయక్, తుమ్మల ఫణికుమార్, గయాజ్, శ్రీను, మణిదీప్, శ్రీనాథ్, పిన్నబోయిన శ్రీనివాస్‌యాదవ్, మదార్, జానీ, శంకర్ నాయక్, మస్తాన్, నూనె రవికుమార్ పాల్గొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఖూనీ : మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు