IndiGo flight : ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతా నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరుకు బయలుదేరిన విమానం.. కోల్కతా ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని తిరిగి కోల్కతా ఎయిర్పోర్టులో సేఫ్ ల్యాండింగ్ చేశారు.
ఈ ఘటనలో ప్రయాణికులకుగానీ, సిబ్బందికిగానీ ఎలాంటి హాని జరగలేదని ఇండిగో ఎయిర్లైన్స్ స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. అయితే ప్రయాణికులు మాత్రం విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఒక ఇంజిన్లో మంటలు చెలరేగాయని చెబుతున్నారు. కానీ దీనిపై ఎయిర్లైన్స్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.