కోల్కతా: భారత్లో అత్యంత సురక్షితమైన నగరం(Safest City)గా కోల్కతా నిలిచింది. వరుసగా మూడవసారి ఆ నగరం సేఫెస్ట్ సిటీగా నిలవడం విశేషం. జాతీయ నేర గణాంకాల శాఖ ఈ విషయాన్ని తెలిపింది. లక్ష జనాభాలో జరుగుతున్న నేరాల ఆధారంగా ఎన్సీఆర్బీ ఈ రిపోర్టును ఇచ్చింది. 2022లో కోల్కతాలో లక్ష జనాభాలో నమోదు అయిన కేసుల సంఖ్య 86.5 శాతంగా ఉంది. ఇక పుణెలో 280.7, హైదరాబాద్లో 299.2 శాతంగా ఉన్నట్లు ఎన్సీఆర్బీ డేటా పేర్కొన్నది. ఐపీసీ, ఎస్ఎల్ఎల్ చట్టాల కింద నమోదు అయిన కేసులనే క్రైంగా గుర్తించనున్నారు. 2021లో కోల్కతాలో లక్ష జనాభాలో 103.4 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఆ సంఖ్య 2022 నాటికి 86.5కు పడిపోయినట్లు డేటాలో వెల్లడించారు. 2020లో ఆ కేసుల సంఖ్య 129.5గా ఉంది.