కొచ్చి, ఫిబ్రవరి 22: ఐఆర్ఎస్ అధికారితో పాటు అతని సోదరి, తల్లి అనుమానాస్పదంగా మృతి చెందడం కేరళలోని కొచ్చిలో కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కస్టమ్స్ విభాగంలో అదనపు కమిషనర్‌గా పని చేస్తున్న ఝార్ఖండ్‌కు చెందిన మనీశ్ విజయ్ తన తల్లి శకుంతల దేవి, సోదరి షాలిని విజయ్‌తో పాటు కొచ్చిలో ఉంటున్నారు.
నాలుగు రోజులుగా మనీశ్ ఆఫీస్‌కు రాకపోవడంతో సహోద్యోగులు ఇంటికి వెళ్లి చూడగా దుర్వాసన వచ్చింది. పోలీసుల సాయంతో ఇంట్లోకి వెళ్లి చూడగా మనీశ్, అతని సోదరి వేర్వేరు గదుల్లో ఉరి వేసుకొని కనిపించారు. మరో గదిలో వారి తల్లి విగతజీవిగా కనిపించింది. ఆమెను తెల్లటి వస్త్రంలో చుట్టి, పూలు చల్లారు. వారి మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.