King Cobra | నాగుపాములు.. ఆ పేరు వినగానే శరీరమంతా వణికిపోతోంది. మన కళ్లతో చూస్తే ఒళ్లంతా చెమటలు పట్టేస్తోంది. అలాంటి ఓ నాగుపాము ఏకంగా యువకుడి దుప్పట్లోనే దూరింది. రాత్రంతా అతనితో పాటు నిద్రించింది. తెల్లారిన తర్వాత దుప్పట్లో దాక్కున్న పామును చూసిన యువకుడు భయంతో వణికిపోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని సిరోజం గ్రామంలో వెలుగు చూసింది.
ఓ యువకుడు రాత్రి 10 గంటల సమయంలో నిద్రకు ఉపక్రమించాడు. దుప్పటి కప్పుకున్న యువకుడి వద్దకు మెల్లిగా ఓ నల్ల నాగుపాము చేరింది. అతని దుప్పట్లో దూరింది. కానీ యువకుడికి ఎలాంటి హానీ కలిగించలేదు. ఉదయం 6 గంటలకు ఆ అబ్బాయికి మెలకువ వచ్చింది. బుసలు కొడుతున్న శబ్దం వినిపించింది. ఇంకేముంది భయంతో బయటకు పరుగులు తీశాడు. చెమటలు పట్టేశాయి. ఇక తక్షణమే పాములు పట్టే వ్యక్తికి ఫోన్ చేసి సమాచారం అందించాడు. పాములు పట్టే వ్యక్తి వచ్చి.. దుప్పట్లో దూరిన నాగుపామును పట్టేశాడు. అయితే ఇలాంటి పాములు ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ వంటి దేశాల్లో కనిపిస్తాయన్నాడు.