న్యూఢిల్లీ : దివంగత పంజాబీ గాయకుడు సిద్ధూ మూసే వాలాకు కిలీ పాల్ అతడి సోదరి నీమా పాల్ తమ లేటెస్ట్ వీడియోలో (viral video) నివాళులర్పించారు. వీరు షేర్ చేసిన వీడియోలో మూసే వాలా సాంగ్ మేరే నాకు లిప్ సింక్ ఇవ్వడం కనిపిస్తుంది.
ఈ నెల ఆరంభంలో రిలీజైన ఈ సాంగ్‌లో సిద్ధూ పాటలకు నైజీరియన్ సింగ్ బర్నా బాయ్ ర్యాప్‌తో ఆకట్టుకున్నారు. ఈ పాట సిద్ధూ అఫిషియల్ యూట్యూబ్ చానెల్లో రిలీజైంది. దివంగత గాయకుడి పేరు ప్రఖ్యాతులను ప్రస్తావిస్తూ బిల్‌బోర్డుల నుంచి న్యూస్పేపర్ల వరకూ అతడి పేరు మార్మోగిన తీరును ఈ పాటలో కండ్లకు కట్టారు.
ఈ వీడియో ఏకంగా 3.1 కోట్ల వ్యూస్‌ను రాబట్టింది. ఈ వీడియోను కిలీ పాల్ తన ఇన్స్టాగ్రాం అకౌంట్లో షేర్ చేస్తూ ఇప్పటికీ చరిత్ర లిఖిస్తూ…ఎన్నటికీ గుర్తుండిపోతారని రాసుకొచ్చారు. దివంగత పంజాబీ గాయకుడిని ఇంటర్నెట్ తలుచుకుంది. పలువురు యూజర్లు సిద్ధూ మూసే వాలాను లెజెండరీ సింగర్‌గా ప్రస్తుతించారు. మూసే వాలాను గత ఏడాది మే 29న పంజాబ్‌లోని మన్సా జిల్లాలో కాల్చిచంపారు.