Champai Soren : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. జేఎంఎం నేత చంపై సోరెన్ బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. పాలక జేఎంఎంలో చీలిక అనివార్యమవుతుందని కాషాయ నేతలు ఆశిస్తున్నారు. అయితే చంపై సోరెన్ బీజేపీలో చేరిక వార్తలపై జార్ఖండ్ పీసీసీ చీఫ్ కేశవ్ మహతో కమలేష్ స్పందించారు.
తమకు అలాంటి సమాచారం ఏమీ లేదని అన్నారు. చంపై సోరెన్ తన కూతురును కలిసేందుకే ఢిల్లీ వచ్చారని తమకు సమాచారం ఉందని, ఆయన కాషాయ పార్టీలో చేరతారనే ప్రచారమంతా కేవలం వదంతులేనని వ్యాఖ్యానించారు. చంపై సోరెన్ తదుపరి అడుగులు కాషాయ కూటమి దిశగా ఉండే అవకాశం లేదని అన్నారు
కాగా, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) సీనియర్ నేత చంపై సోరెన్ తనఎక్స్ ప్రొఫైల్ నుంచి జేఎంఎం పేరును తొలగించడంతో ఆయన కాషాయ పార్టీలో చేరబోతున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తనను రాజీనామా చేయించి హేమంత్ సోరెన్ తిరిగి సీఎం పగ్గాలు చేపట్టడంతో పార్టీ అధిష్టానంపై ఆయన కినుక వహించారు. హైకమాండ్‌పై ఆగ్రహంతో ఆయన బీజేపీకి చేరువకానున్నారనే ప్రచారం సాగుతోంది.
Read More :
Iman Esmail Aka Imanvi | ప్రభాస్ కోసం కొత్త బ్యూటీ.. ఇంతకు ఎవరు ఈ ఇమాన్వి.?