Kerala woman : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని షార్జాలో కేరళకు చెందిన 29 ఏళ్ల అతుల్య శేఖర్ అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వరకట్న వేధింపులే ఆమె మరణానికి కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కొల్లాంకు చెందిన అతుల్య శేఖర్ 2014లో సతీష్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. శనివారం షార్జాలోని తన అపార్ట్మెంట్లో ఆమె మృతదేహం లభ్యమైంది.
తన అల్లుడు సతీష్.. అతుల్యను గొంతు నులిమి, కడుపులో తన్ని, తలపై ప్లేట్‌తో కొట్టాడని, దీని వల్ల అతుల్య మరణించిందని ఆమె తల్లి ఆరోపిస్తోంది. పెళ్లయినప్పటి నుండి సతీష్ వరకట్నం కోసం అతుల్యను వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. వారు సతీష్‌కు 40 సవర్ల బంగారు నగలు, ఒక బైక్ ఇచ్చారని చెప్పారు. కాగా సతీష్‌పై యూఏఈలో హత్య కేసు నమోదైనట్టు తెలుస్తోంది.