కొట్టాయం: కేరళలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ.. ప్రెగ్నెంట్ విద్యార్థులకు 60 రోజుల మెటర్నిటీ లీవ్‌ను మంజూరీ చేయనున్నది. 18 ఏళ్లు దాటిన విద్యార్థినులకు ఈ అవకాశం కల్పించారు. చదువులకు ఎటువంటి అవాంతరం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్ సీటీ అరవింద కుమార్ ఈ నిర్ణయంపై ఆదేశాలను జారీ చేశారు. ఈ అంశంపై కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మహిళా విద్యార్థినులకు ప్రెగ్నెన్సీ లీవ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పురుడుకు ముందు లేదా తర్వాత కానీ మెటర్నిటీ లీవ్‌లను వాడుకోవచ్చు. కానీ కేవలం తొలి లేదా రెండవ ప్రెగ్నెన్సీ సమయంలో మాత్రమే దీన్ని వాడుకోవచ్చు. అబార్షన్ లేదా ట్యూబెక్టమీ కేసుల్లో 14 రోజుల లీవ్ ఇవ్వనున్నట్లు వర్సిటీ రిపోర్ట్ పేర్కొన్నది.