తిరువనంతపురం: కేరళలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. రోజూ 50 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ కూడా కొత్తగా 51,887 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 60,77,556 కి చేరింది. గత వారం రోజులుగా రోజూ 50 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నప్పటికీ సోమవారం ఆ సంఖ్య 42,154కు దిగివచ్చింది. ఇవాళ మళ్లీ 51,887కు పెరిగింది.
ఇక కరోనా మరణాలు కూడా కేరళలో భారీగానే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కూడా కొత్తగా 1,205 మందికి కరోనా సోకింది. దాంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 55,600కు పెరిగింది. ఇక కొత్తగా 40,383 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. దాంతో రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 56,53,376కు చేరింది.