తిరువనంతపురం: కేరళలో కరోనా ( Corona in kerala ) పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గింది. చాలా రోజుల తర్వాత ఇవాళ 10 వేల లోపు కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 9,735 మంది కరోనా మహమ్మారి బారినపడ్డారు. అయితే, కరోనా మరణాలు మాత్రం ఇవాళ కూడా ఎప్పటిలాగే 100కు పైగా నమోదయ్యాయి. కొత్తగా 151 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 25,677కు పెరిగింది.
మహమ్మారి బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య ఇవాళ కూడా పాజిటివ్ కేసుల కంటే ఎక్కువగానే నమోదైంది. ఇవాళ కొత్తగా 13,878 మంది కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం కరోనా రికవరీలు, మరణాలు పోను రాష్ట్రంలో 1,24,441 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవాళ మొత్తం 93,202 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.