దుబాయ్: యూఏఈలో నివసిస్తున్న ఓ కేరళీయుడికి అదృష్టం మరోసారి తలుపు తట్టింది. పదేండ్ల లోపే అతడు ప్రఖ్యాత దుబాయ్ డ్యూటీ-ఫ్రీ మిలీనియమ్ మిలియనీర్ లాటరీ పోటీలో సుమారు రూ.8.5 కోట్లు గెలుచుకున్నారు. చిన్న కాంట్రాక్టింగ్ కంపెనీలో సైట్ సూపర్వైజర్గా పనిచేసే పాల్ జోస్ మావెలీ(60) తొలిసారి నవంబర్ 2016లో ఈ పోటీలో భారీ నగదు బహుమతి పొందారు.
తాజాగా మరోసారి అతడికి జాక్పాట్ లభించింది. దీనిపై సోషల్ మీడియాలో ఒక యూజర్ స్పందిస్తూ.. ‘శుభాకాంక్షలు! భారతీయుడి అదృష్ట రహస్యాలను నేను తెలుసుకోవాలనుకుంటున్నాను’అని వ్యాఖ్యానించారు. 1999లో దుబాయ్ డ్యూటీ-ఫ్రీ మిలీనియమ్ ప్రారంభమైనప్పటి నుంచి పాల్ స్నేహితులతో కలిసి క్రమం తప్పకుండా లాటరీ కొంటున్నారని ఖలీల్ టైమ్స్ తెలిపింది.