Five Dead in Same Family | ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ఇంట్లో శవాలై కనిపించారు. ఈ ఘటనలో కేరళ పాలా సమీపంలో జరిగింది. మృతులను జాసన్ థామస్ అనే వ్యక్తితో పాటు అతని భార్య మెరీనా, ముగ్గురు పిల్లలుగా గుర్తించారు. అలకున్నంలోని జరండుపర నివాసి కాగా.. జాసన్ ఓ రబ్బర్ ఫ్యాక్టరీలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. జాసన్ మృతదేహం ఇంట్లో వేలాడుతూ కనిపించగా.. భార్యా పిల్లల మృతదేహాలు నేలపై కనిపించాయి. మృతదేహాల చుట్టూ రక్తపు మరకలున్నాయి. అయితే, జాసనే భార్యాపిల్లలను చంపి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనిమానిస్తున్నారు.
అయితే, జాసన్ కుటుంబీకులును సోమవారం కలిసినట్లుగా అంగన్వాడీ టీచర్ తెలిపారు. అయితే, ఆ సమయంలో ఏదో విచారంలో ఉన్నట్లుగా అనిపించిందని పేర్కొన్నారు. జాసన్-మెరీనా ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అతని కుటుంబీకులతో సంబంధాలు లేవు. నివాస ప్రాంతంలోనూ ఎవరూ సన్నిహితులు లేరు. కొంతకాలంగా జాన్ ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. సంఘటనా స్థలంలోనే సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.