తిరువనంతపురం: మార్కెట్ టార్గెట్లు రీచ్ కానందుకు ఉద్యోగులను ఒక సంస్థ శిక్షించింది. ఇందులో భాగంగా ఒక ఉద్యోగి మెడకు బెల్ట్ తగిలించి కుక్క మాదిరిగా నడిపించారు. (employee made to crawl like dog) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కలకలం రేపిన ఈ సంఘటనపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. కేరళలోని కొచ్చిలో ఈ సంఘటన జరిగింది. ఒక ప్రైవేట్ మార్కెటింగ్ సంస్థలో పని చేసే ఉద్యోగులు తమ లక్ష్యాలను చేరుకోనందుకు పలు విధాలుగా శిక్షించారు. ఒక ఉద్యోగిని కుక్క మాదిరిగా మోకాళ్లపై నడిపించారు. మరో ఉద్యోగి ప్యాంటును బలవంతంగా విప్పించారు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అధికారులు స్పందించారు. రాష్ట్ర కార్మిక శాఖ దీనిపై దర్యాప్తునకు ఆదేశించింది. హైకోర్టు న్యాయవాది కులత్తూర్ జైసింగ్ ఫిర్యాదు మేరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా ఈ ఘటనపై కేసు నమోదు చేసింది.
మరోవైపు ఆ కంపెనీ యజమానితో విభేదాలున్న మాజీ మేనేజర్ ట్రైనీ ఉద్యోగులతో ఈ వీడియో రికార్డ్ చేయించాడని బాధిత ఉద్యోగి పోలీసులకు తెలిపాడు. నాలుగు నెలల కిందట తీసిన వీడియో అని చెప్పాడు. ఆ మేనేజర్‌ను కంపెనీ తొలగించడంతో యజమానిపై ప్రతీకారం కోసం పాత వీడియోను వైరల్ చేస్తున్నారని ఆరోపించాడు. తాను ఇప్పటికీ ఆ సంస్థలో పని చేస్తున్నానని అతడు వెల్లడించాడు. అయితే ఆ ఉద్యోగితో బలవంతంగా ఆ కంపెనీ ఇలా వివరణ ఇప్పించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వాస్తవం ఏమిటన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
जंजीर से बांधकर जानवरों की तरह चलवाया?…टारगेट नहीं पूरा होने पर बेशर्म कंपनी ने कर्मचारियों को दी ऐसी सज़ा?
केरल के कोच्चि का एक वीडियो सोशल मीडिया पर वायरल है, दावा है कि एक प्राइवेट मार्केटिंग फर्म के खराब प्रदर्शन करने वाले कर्मचारियों को अमानवीय व्यवहार का सामना करना पड़… pic.twitter.com/3Du2kgPP1u
— AajTak (@aajtak) April 6, 2025