తిరువనంతపురం: కేరళలోని కోర్టు ఎమ్మెల్యే రాహుల్ మామ్కూటతిల్(MLA Rahul Mamkootathil) కస్టడీకి ఓకే చెప్పేసింది. మూడు రోజుల పాటు ఎమ్మెల్యే రాహుల్‌ను కస్టడీలోకి తీసుకునేందుకు తిరువల్ల జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు ఇచ్చారు. దీంతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బృందం ఆయన్ను అదుపులోకి తీసుకున్నది. లైంగిక దాడి ఆరోపణలు రావడంతో ఎమ్మెల్యే రాహుల్‌ను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిన విషయం తెలిసిందే. అయితే ఏడు రోజులకు బదులుగా కేవలం మూడు రోజులకు మాత్రమే అనుమతి ఇచ్చింది.
యువజన సంఘాలు నిరసన చేపట్టడం వల్ల ఆ ఎమ్మెల్యేను కోర్టు ముందు హాజరుపరిచారు. తిరువల్ల తాలుక ఆస్పత్రిలో మెడికల్ పరీక్ష తర్వాత ఆయన్ను కోర్టుకు తీసుకెళ్లారు. ఆస్పత్రి ముందు డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, యువ మోర్చా సంఘాలు ఆందోళన చేపట్టాయి. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను ఎమ్మెల్యే రాహుల్ రేప్ చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. 2024 ఏప్రిల్‌లో ఓ హోటల్లో ఆ రేప్ జరిగినట్లు ఫిర్యాదులో ఉన్నది.