Baba Ramdev | పాలక్కాడ్ : యోగా గురువు, పతంజలి ఆయుర్వేద్ వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ , ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణలకు కేరళలోని పాలక్కాడ్ జిల్లా కోర్టు బెయిలు ఇవ్వదగిన అరెస్ట్ వారంట్‌ను ఈ నెల 16న జారీ చేసింది.
పతంజలి ఆయుర్వేద్ తన ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులపై తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తున్నదని కేరళ డ్రగ్ రెగ్యులేటర్స్ చేసిన ఫిర్యాదుపై ఈ చర్య తీసుకుంది. కన్నూరుకు చెందిన కేవీ బాబు 2023 నవంబరులో పతంజలి ప్రకటనలపై ఫిర్యాదులు చేశారు. వీటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేరళ డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ రాష్ట్రంలోని తన కార్యాలయాలను ఆదేశించింది.