కారులో చెలరేగిన మంటలు.. సజీవ దహనమైన దంపతులు
ముందు సీట్లలో కూర్చొన్న భార్యాభర్తలకు మంటలు అంటుకున్నాయి. కారు ముందు డోర్లు జామ్ కావడంతో అవి తెరుచుకోలేదు.
తిరువనంతపురం: కారులో మంటలు చెలరేగాయి. దీంతో ముందు సీట్లలో ఉన్న దంపతులు సజీవ దహనమయ్యారు. వెనుక సీట్లలో ఉన్న నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. కేరళలోని కన్నూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కుట్యాత్తూరు జిల్లాకు చెందిన ఆరుగురు వ్యక్తులు గురువారం కన్నూర్లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి కారులో ప్రయాణించారు. అయితే ఆసుపత్రి సమీపంలో వారు ప్రయాణించిన కారులో మంటలు చెలరేగాయి. ముందు సీట్లలో కూర్చొన్న భార్యాభర్తలకు మంటలు అంటుకున్నాయి. కారు ముందు డోర్లు జామ్ కావడంతో అవి తెరుచుకోలేదు. గమనించిన స్థానికులు సహాయం చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. కారు ముందు సీట్లలో ఉన్న దంపతులు హాహాకారాలు చేస్తూ మంటల్లో సజీవ దహనమై మరణించారు.
కాగా, కారు వెనుక సీట్లలో ఉన్న ఒక చిన్నారితో సహా నలుగురు వెంటనే డోర్లు తెరుచుకుని మంటల నుంచి బయటపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆ కారు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. మరోవైపు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన 26 ఏళ్ల మహిళ గర్భవతి అని చెకప్ కోసం ఆసుపత్రికి వస్తున్నట్లు పేర్కొన్నారు. కారుకు మంటలు వ్యాపించడంపై సాంకేతిక, ఆటోమొబైల్ నిపుణులతో దర్యాప్తు చేయిస్తామని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- burnt alive
- car
- fire
- Kerala Couple
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

