తిరువనంతపురం : ఓ ప్రయాణికుడు టికెట్ లేకుండా రైల్లో ప్రయాణించినందుకు అతన్ని పోలీసులు తీవ్రంగా చితకబాదారు. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. మావళి ఎక్స్ప్రెస్లో ఓ పోలీసు కానిస్టేబుల్ ప్రయాణికుల టికెట్లను చెక్ చేస్తుండగా.. టికెట్ లేని ప్రయాణికుడు తారసపడ్డాడు. టికెట్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తూ.. అతనిపై పోలీసు దాడి చేశాడు. ప్రయాణికుడు మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు అనుమానించి.. అతన్ని మరింత హింసించారు. ఈ దృశ్యాలను అక్కడున్న ఓ ప్రయాణికుడు చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. దీంతో పోలీసులపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.