కొచ్చి: అదానీ గ్రూపుకు చెందిన లాజిస్టిక్స్ పార్క్‌ను కేరళలోని కలమసారేలో ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్(CM Vijayan) శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో అదానీ లాజిస్టిక్స్ పార్క్ కీలక మైలురాయి అవుతుందని అధికారులు చెప్పారు. ఇన్వెస్ట్ కేరళ గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. సుమారు 70 ఎరాల్లో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నారు. తొలి పెట్టుబడిగా సుమారు 600 కోట్లు ఖర్చు చేయనున్నారు. సుమారు 13 లక్షల చదరపు గజాల విస్తీర్ణంలో పార్క్‌ను ఏర్పాటు చేస్తారు. కొత్త టెక్నాలజీకి అనుగుణంగా సమగ్రమైన రీతిలో లాజిస్టిక్స్ సౌకర్యాలు ఉంటాయి.