తిరువనంతపురం, నవంబర్ 13: శబరిమల వెళ్లే భక్తులకు తమ తీర్థయాత్ర అనుభవాన్ని సులభతరం చేయడమే కాక, మరింత మెరుగుపర్చడానికి కృత్రిమ మేధ ద్వారా రూపొందించిన ఏఐ అసిస్టెంట్ ‘స్వామి చాట్‌బాట్’ లోగోను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ బుధవారం ఆవిష్కరించారు.
పతనంతిట్ట జిల్లా యంత్రాంగం రూపొందించిన ఈ స్వామి చాట్‌బాట్ స్మార్ట్‌ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తుంది. ఇంగ్లిష్, తెలుగు, హిందీ, మలయాళం, తమిళం, కన్నడలో మొత్తం ఆరు భాషల్లో ఇది సమగ్ర సేవలు అందిస్తుంది.
దీని ద్వారా శబరిమల పూజా సమయాలు, రవాణా సౌకర్యాలు, ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్ల సమాచారం తదితర వివరాలు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా పోలీస్, అటవీ శాఖల ద్వారా కూడా యాత్రికులకు సేవలు అందించి వారి తీర్థయాత్ర ఆనందకరం చేస్తుందని నిర్వాహకులు తెలిపారు.