తిరువనంతపురం: ప్రభుత్వ సేవల డిజిటల్ యాక్సెస్ కోసం రూపొందించిన కే-స్మార్ట్ (K-SMART) యాప్‌ను కేరళ సీఎం పినరయి విజయన్ సోమవారం ప్రారంభించారు. కేరళ సొల్యూషన్స్ ఫర్ మేనేజింగ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ (K-SMART) యాప్ ద్వారా స్థానిక పాలనా సంస్థలు అందించే సేవలు ఇకపై పౌరుల చేతికి అందుతాయని తెలిపారు. సమాజంలోని వివిధ రంగాల అభివృద్ధికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఇన్ఫర్మేషన్ కేరళ మిషన్ అభివృద్ధి చేసిన ఈ యాప్‌ను మొదట రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో అమలు చేస్తామని చెప్పారు. తర్వాత దశలో ఏప్రిల్ 1 నుంచి గ్రామ పంచాయతీలకు విస్తరిస్తామని అన్నారు.
కాగా, కే-స్మార్ట్ ద్వారా 35 రకాల స్థానిక ప్రభుత్వ సేవలు పొందవచ్చని ప్రభుత్వ అధికారులు తెలిపారు. వెబ్ పోర్టల్‌లోకి లాగిన్ అయ్యి అవసరమైన సమాచారాన్ని అందించడం ద్వారా ఈ సేవలన్నింటినీ ప్రజలు ఒకే ప్లాట్‌ఫారమ్ ద్వారా పొందవచ్చని చెప్పారు. జననాలు, మరణాలు, వివాహాల నమోదు, వ్యాపార లైసెన్స్‌లు, ఆస్తి పన్నులు వంటి ఎనిమిది సేవలు తొలుత అందుబాటులో ఉంటాయని అధికారులు వివరించారు.
Launched K-Smart, the LDF Govt’s flagship project aiming to digitise services of local self-government bodies in Kerala. Crucial for transparent and efficient governance, K-Smart signifies a significant stride in Kerala’s journey towards becoming an advanced society.… pic.twitter.com/1MKk6elaDQ
— Pinarayi Vijayan (@pinarayivijayan) January 1, 2024