న్యూఢిల్లీ, జూన్ 11: మనుషుల మాదిరే ఏనుగులు కూడా తమ గుంపులోని ఏనుగులను పేర్లతో పిలుచుకుంటాయని, అవి ఒకదానికికొకటి పేర్లు పెట్టుకుంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. కెన్యా అడవుల్లో ఏనుగుల స్వర పేటిక శబ్దాలను రికార్డ్ చేసిన సైంటిస్టులు, తిరిగి వాటి ఆడియోను ప్లే చేసి 17 ఏనుగులపై పరీక్షించారు.
తమను ఉద్దేశించి వచ్చిన ప్రతి పిలుపునకు అవి ప్రతిస్పందించటం సైంటిస్టులకు కనిపించింది. కెన్యాలోని అంబసోలి జాతీయ పార్క్, సాంబురు నేషనల్ రిజర్వ్‌లోని 100 ఏనుగులు పేర్లతో పిలుస్తున్నాయన్న సంగతి పరిశోధకుల అధ్యయనంలో తేలింది.