పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్, ఆప్ అధినేత, సీఎం కేజ్రీవాల్ అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. పంజాబ్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. మార్చి 16న భగవంత్ మాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ఆధ్వర్యంలో ఓ రోడ్ షో నిర్వహిస్తున్నారు. రోడ్‌షోలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అమృత్‌సర్‌కు చేరుకున్నారు. గురుద్వారా దర్శనం తర్వాత ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్, కేజ్రీవాల్ రోడ్‌షోలో పాల్గొంటున్నారు.
భగవంత్ మాన్ ధురీ నియోజకవర్గం నుంచి 58,000 ఓట్లతో ఘన విజయం సాధించారు. ఆ తర్వాత ఆప్ నూతన ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఇందులో శాసనసభా పక్ష నేతగా భగవంత్ మాన్‌ను ఎన్నుకున్నారు. ఎమ్మెల్యేలందరినీ కేబినెట్లోకి తీసుకోవడం కుదరదని, ఇందుకోసం ఒత్తిళ్లు తేవద్దని భగవంత్ మాన్ విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేలందర్నీ మంత్రులుగా చూసుకుంటున్నానని ఆయన హామీ ఇచ్చారు.