Russian Oil: రష్యా ఇంధనం కొనేందుకు ఇంకా ఆర్డర్ ఇవ్వని భారత రిఫైనరీలు!
Russian Oil: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం సంస్థలతో పాటు అతిపెద్ద రిఫైనరీ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా రష్యా ఇంధనాన్ని కొనుగోలు చేసేందుకు ఆఫర్లు వెల్లడించడం లేదని తెలిసింది. మార్చి, ఏప్రిల్ నెలకు కావాల్సిన ఆయిల్ లోడింగ్‌కు చెందిన ఆర్డర్లు రాలేదని ఓ ప్రముఖ మీడియా తన కథనంలో పేర్కొన్నది.
న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన రిఫైనరీ సంస్థలు.. రష్యా నుంచి ఇంధన(Russian Oil) కొనుగోళ్లను దాదాపు ఆపేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ కథనం ప్రముఖ మీడియా ఏజెన్సీలో ప్రచురితమైంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం సంస్థలతో పాటు అతిపెద్ద రిఫైనరీ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా రష్యా ఇంధనాన్ని కొనుగోలు చేసేందుకు ఆఫర్లు వెల్లడించడం లేదని తెలిసింది. మార్చి, ఏప్రిల్ నెలకు కావాల్సిన ఆయిల్ లోడింగ్‌కు చెందిన ఆర్డర్లు రాలేదని ఆ మీడియా కథనంలో వెల్లడైంది. అయితే ఐఓసీ, బీపీ, రిలయన్స్ సంస్థలు.. మార్చి నెలకు కొంత మేర ఆర్డర్ గతంలోనే చేసుకున్నా.. ఇతర ఇండియన్ కంపెనీలు మాత్రం తమ ఆర్డర్‌ను పూర్తిగా నిలిపివేసినట్లు తెలిసింది. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ట్రేడ్‌డీల్ కుదిరిన నేపథ్యంలో భారతీయ రిఫైనరీలు రష్యా నుంచి చమురును కొనడం ఆపేసిట్లు భావిస్తున్నారు. రష్యా నుంచి ఇంధన దిగుమతులు 38 నెలల కనిష్టానికి పడిపోయాయి. 2025 డిసెంబర్లో 2.7 బిలియన్ల డాలర్లు ఉన్నది. ఆయిల్ దిగుమతిపై భారత ప్రభుత్వం నేరుగా ఆదేశాలు ఇవ్వకున్నా.. కంపెనీలు మాత్రం కొత్తగా ఎటువంటి ఆర్డర్ పెట్టలేదని తెలుస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

