డెహ్రాడూన్: దీపావళి సందర్భంగా కేదార్నాథ్ ఆలయాన్ని(Kedarnath Temple) పువ్వులతో అలంకరించారు. శీతాకాలం ప్రారంభం అవుతున్న సందర్భంగా ఉత్తరాఖండ్‌లోని ఆ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని నవంబర్ 3వ తేదీన మూసివేయనున్నారు. ఆ రోజు ఉదయం 8.30 నిమిషాలకు ఆలయ ద్వారాలను మూసివేస్తారు. కేదార్నాథ్ థామ్‌లో ఉన్న శ్ర భకుంత్ భైరవనాథ్ ఆలయాన్ని మంగళవారమే మూసేశారు. కేదార్‌నాథ్‌ను మళ్లీ ఆర్నెళ్ల తర్వాత వేసవి కాలంలో ఓపెన్ చేయనున్నారు. దీపావళి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు కేదారీశ్వరుడి దర్శనం కోసం వచ్చారు.
#WATCH | Uttarakhand: Shri Kedarnath temple decorated with flowers on the occasion of Diwali.
The portals of Shri Kedarnath Dham are closing for the winter season on Sunday, 3 November, at 8:30 am. Yesterday, the portals of Shri Bhakunt Bhairavnath in Shri Kedarnath Dham were… pic.twitter.com/vtbvQZqWqd
— ANI (@ANI) October 30, 2024