మంగళవారం 22 సెప్టెంబర్ 2020
National - Jul 10, 2020 , 16:30:45

అది అంతుచిక్క‌ని వ్యాధి కాదు: క‌జ‌కిస్థాన్‌

అది అంతుచిక్క‌ని వ్యాధి కాదు: క‌జ‌కిస్థాన్‌

హైద‌రాబాద్‌: క‌జికిస్థాన్‌ను అంతుచిక్క‌ని వ్యాధి విస్త‌రిస్తున్న‌దంటూ చైనా చేసిన ప్ర‌క‌ట‌న‌ను క‌జ‌కిస్థాన్ ప్ర‌భుత్వం కొట్టిపారేసింది. చైనా ప్ర‌క‌ట‌న‌లో నిజం లేద‌ని తేల్చిచెప్పింది. ప్ర‌పంచ‌మంతా క‌రోనా వైర‌స్‌తో పోరాటం చేస్తున్నవేళ క‌జ‌కిస్థాన్‌లో కొత్త ర‌కం వ్యాధి ప్ర‌బ‌లిందని చైనా ప్ర‌క‌టించింది. ఈ అంతుచిక్క‌ని న్యుయోనియా వ్యాధి బారినప‌డి గ‌త నెల రోజుల వ్య‌వ‌ధిలో 1772 మంది ప్రాణాలు కోల్పోయార‌ని, అది క‌రోనా మ‌హ‌మ్మారికంటే ప్ర‌మాద‌క‌ర‌మ‌ని పేర్కొన్న‌ది. అందువ‌ల్ల ఆ దేశంలోని చైనీయులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని క‌జకిస్థాన్‌లోని చైనా రాయ‌బార కార్యాల‌యం హెచ్చ‌రించింది. 

ఈ నేప‌థ్యంలో చైనా ఎంబ‌సీ ప్ర‌క‌ట‌నను ఖండిస్తూ క‌జికిస్థాన్ ప్ర‌భుత్వం తాజా ప్ర‌క‌ట‌న చేసింది. ప్ర‌స్తుతం దేశంలో ప్ర‌బ‌లుతున్న వ్యాధికి వైరల్ న్యూమోనియా ఇన్‌ఫెక్షన్, బ్యాక్టీరియా, ఫంగల్  ఇన్‌ఫెక్షన్ లక్షణాలతో పోలికలు ఉన్నాయని తెలిపింది. ఈ వ్యాధి కార‌ణంగా అధిక‌ మ‌ర‌ణాలు సంభ‌విస్తున్న‌మాట వాస్త‌వమే అయినా, ఇది అంతుచిక్క‌ని వ్యాధి మాత్రం కాద‌ని క‌జ‌కిస్థాన్ ఆరోగ్య శాఖ పేర్కొన్న‌ది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనిపై రిపోర్టు ఇచ్చింద‌ని తెలిపింది.  


logo