జమ్ములో కశ్మీరీ పండిట్లు మరోసారి రోడ్డెక్కారు. వీరితో పీఎం ప్యాకేజీ ఉద్యోగులు కూడా జతకట్టారు. కశ్మీర్ లోయ బయట పునరావాసం కల్పించాలని, పెండింగ్ వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ జమ్ములోని లెఫ్టినెంట్ గవర్నర్ నివాసం ఎదుట సోమవారం వేర్వేరుగా ధర్నాలు నిర్వహించారు. సెప్టెంబర్ నుంచి వేతనాలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. ‘కశ్మీర్‌లోయ నుంచి తరలించాలని 280 రోజులుగా నిరసన చేపడుతున్నాం. మా అతిపెద్ద పండుగ శివరాత్రి సమీపిస్తున్నది. పెండింగ్ వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం’ అని ధర్నాలో పాల్గొన్న రోహిత్ రైనా అనే ఉద్యోగి తెలిపారు. పీఎం ప్యాకేజీ ఉద్యోగుల్లో కొందరే విధులు నిర్వర్తిస్తున్నారని, వీరిలో అభద్రతాభావం ఉన్నదని పేర్కొన్నారు.