క్షణ క్షణం.. భయం భయం
కశ్మీర్లో ప్రస్తుత పరిస్థితులు 1990ల నాటి దుస్థితిని తలపిస్తున్నాయని కశ్మీరీ పండిట్లు అంటున్నారు. ‘కశ్మీర్ మాది. మా పూర్వీకులు ఇక్కడే బతికారు. కశ్మీర్లో భద్రత ఉంటుందంటే ఇక్కడికి ఎంతో ఆశతో వచ్చాం. కానీ, వెనక్కు తిరిగి రావాలని మాకు హామీ ఇచ్చినవారు ఇప్పుడు మౌనంగా ఉన్నారు’ అని కేంద్రప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శిస్తున్నారు.
- నిత్యావసరాలకూ బయటకు పోలేని స్థితి
- భద్రత ఇస్తామన్న వారు మౌనంగా ఉన్నారు
- కేంద్రం తీరుపై కశ్మీరీ పండిట్ల విమర్శలు
న్యూఢిల్లీ, జూన్ 8: కశ్మీర్లో ప్రస్తుత పరిస్థితులు 1990ల నాటి దుస్థితిని తలపిస్తున్నాయని కశ్మీరీ పండిట్లు అంటున్నారు. ‘కశ్మీర్ మాది. మా పూర్వీకులు ఇక్కడే బతికారు. కశ్మీర్లో భద్రత ఉంటుందంటే ఇక్కడికి ఎంతో ఆశతో వచ్చాం. కానీ, వెనక్కు తిరిగి రావాలని మాకు హామీ ఇచ్చినవారు ఇప్పుడు మౌనంగా ఉన్నారు’ అని కేంద్రప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శిస్తున్నారు. బయటకు వెళ్లే తిరిగి ఇంటికి వస్తామో లేదో తెలియన భయంకర పరిస్థితులు ఉన్నాయని వాపోయారు.
‘ఆఫీసులు మూసేశారు. నిత్యావసరాలు, మందులు కొనుక్కోవడానికి కూడా బయటకు వెళ్లలేని పరిస్థితి. పిల్లలను కూడా బడికి పంపడం లేదు’ అని ఓ పండిట్ చెప్పారు. కశ్మీర్ పండిట్లలో పీఎం ప్యాకేజీ కింద ఉద్యోగాలు పొందినవారిలో చాలా మంది ఇప్పటికే లోయను వదిలి పోయారని పేర్కొన్నారు. మిగతా 5-10% మంది కూడా రెండు మూడు రోజుల్లో వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.
మాతా ఖీర్ భవానీ మేళాకు పండిట్లు
బుధవారం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య 18వేల మంది కశ్మీర్ పండిట్లు శ్రీనగర్ సమీపంలోని మాతా ఖీర్ భవానీ ఆలయాన్ని సందర్శించారు. జ్యేష్ఠ అష్టమిని పురస్కరించుకొని పూజలు చేశారు. తుల్ముల్లాలో ఉన్న ఖీర్ భవానీ ఆలయంలో ప్రతీ ఏడాది జ్యేష్ఠ అష్టమి రోజున ఖీర్ భవానీ మేలా జరుగుతుంది. దాదాపు 2,500 మంది పండిట్లు సాయంత్రం హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, పీఎం ప్యాకేజీ కింద కశ్మీర్లో ఉద్యోగాలు చేస్తున్నవారికి ప్రమోషన్లు కల్పించేందుకు జమ్ముకశ్మీర్ అధికార యంత్రాంగం అనుమతించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

