Women Prisoners Karwa Chauth | జైలులో మహిళా ఖైదీల కర్వా చౌత్.. ఫోన్లలో భర్త ఫొటోలు చూసి ఉపవాస దీక్ష విరమణ
Women Prisoners Karwa Chauth | జైలు శిక్ష అనుభవిస్తున్న కొందరు మహిళా ఖైదీలు తమ భర్తల దీర్ఘాయువు కోసం కర్వా చౌత్ పూజలు ఆచరించారు. జైలు సిబ్బంది మొబైల్ ఫోన్లలో తమ భర్తల ఫొటోలు చూసిన కొందరు మహిళలు తమ ఉపవాస దీక్షను విరమించారు.
లక్నో: జైలు శిక్ష అనుభవిస్తున్న కొందరు మహిళా ఖైదీలు తమ భర్తల దీర్ఘాయువు కోసం కర్వా చౌత్ పూజలు ఆచరించారు. జైలు సిబ్బంది మొబైల్ ఫోన్లలో తమ భర్తల ఫొటోలు చూసిన కొందరు మహిళలు తమ ఉపవాస దీక్షను విరమించారు. ఉత్తరప్రదేశ్‌లోని లలిత్పూర్ జిల్లా జైలులో ఈ సంఘటన జరిగింది. (Women Prisoners Karwa Chauth) పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు మహిళా ఖైదీలు తమ భర్తల దీర్ఘాయువు కోసం సాంప్రదాయ కర్వా చౌత్‌ను పాటించారు. ఇద్దరు మహిళా ఖైదీలు అదే జైలులో శిక్ష అనుభవిస్తున్న తమ భర్తలతో కలిసి ఈ ఆచారం నిర్వహించేందుకు జైలు అధికారులు అనుమతించారు. మరో ముగ్గురు మహిళా ఖైదీలు కర్వా చౌత్ పూజల తర్వాత మహిళా జైలు సిబ్బంది మొబైల్ ఫోన్లలో తమ భర్తల ఫొటోలు చూసి ఉపవాసాన్ని విరమించారు.
కాగా, ఆసక్తి ఉన్న మహిళా ఖైదీలు సాంప్రదాయ కర్వా చౌత్ ఆచరించేందుకు జైలు సూపరింటెండెంట్ ప్రశాంత్ ఉపాధ్యాయ్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే ఖైదీల సంక్షేమ నిధులతో మెహందీ, గాజులు, సాంప్రదాయ దుస్తులు, పూజా సామాగ్రి, పండ్లు, స్వీట్లు, ఇతర వస్తువులను సమకూర్చారు.

Karwa Chauth In UP Jail
మరోవైపు మహిళా జైలు సిబ్బంది పర్యవేక్షణలో ఆ ఐదుగురు మహిళా ఖైదీలు ఒకరికొకరు మెహందీ పెట్టుకున్నారు. సాంప్రదాయ పూజలు చేయడంతో పాటు కర్వా చౌత్ కథను విన్నారు. ఈ ఆచారం పాటించేందుకు వీలుగా జైలు ప్రాంగణంలో ఒక ప్రత్యేక స్థలాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. చివరగా మహిళా ఖైదీలు జల్లెడ ద్వారా చంద్రుడిని చూసి, తమ భర్తల క్షేమం కోసం ప్రార్థించారు. ఆ తర్వాత ఉపవాస దీక్షను విరమించారు. జైలు అధికారులు వారికి పండ్లు, అల్పాహారం కూడా ఏర్పాటు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Break
- Fast
- Husbands' Photos
- Jail
RELATED ARTICLES
తాజా వార్తలు
Robin Uthappa: ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్‌గా రాబిన్ ఊతప్ప
Women Prisoners Karwa Chauth | జైలులో మహిళా ఖైదీల కర్వా చౌత్.. ఫోన్లలో భర్త ఫొటోలు చూసి ఉపవాస దీక్ష విరమణ
Scene | సూర్య ‘సీన్’ సినిమాతో తమిళనాడులో మళ్లీ తెల్లవారుజాము షోలు .. కోలీవుడ్‌లో ఆసక్తికర చర్చ!
AP News | టీడీపీలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే అప్పల నాయుడు
NZvIND: గ్లెన్ ఫిలిప్స్ సెంచరీ.. ఇండియా టార్గెట్ 260
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

