బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్ని కుదిపేస్తున్న ‘వాల్మీకి కార్పొరేషన్ స్కామ్’లో ఈడీ అధికారులు మాజీ మంత్రి బీ నాగేంద్ర బంధువులు, అనుచరుల నివాసాల్లో సోదాలు నిర్వహించారు. బళ్లారి, కొప్పాల్, రాయ్‌చూర్‌లో తనిఖీలు చేపట్టారు. బళ్లారిలో నాగేంద్ర బంధువు టీ యెర్రిస్వామి, సహాయకుడు విజయ్‌కుమార్‌ల నివాసాల్లో అధికారులు సోదాలు జరిపారు.
ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టర్ జశ్వంత్ రెడ్డిపైనా ఈడీ దాడులు జరిపినట్టు తెలిసింది. వాల్మీకి కుంభకోణం కేసులో చార్జిషీట్ దాఖలు చేసే సమయం వచ్చిందని, దీంతో సోదాల్ని ఉధృతం చేసినట్టు సంబంధిత అధికారులు చెప్పారు.