బెంగళూరు: మహారాష్ట్రలో మొదలైన హనుమాన్ చాలీసా వివాదం తాజాగా బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటకకు వ్యాపించింది. మసీదుల్లోని లౌడ్ స్పీకర్లలో అజాన్‌కు వ్యతిరేకంగా సోమవారం ఉదయం 5 గంటలకు ఆ రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆలయాల్లోని మైకుల్లో హనుమాన్ చాలీసాను పఠించారు. ఉదయం ఆరు గంటల వరకు సుప్రభాతంతో పాటు భక్తి పాటలు వినిపించారు. హిందూ సంఘమైన శ్రీరామ్ సేన ఆధ్వర్యంలో పలు ఆలయాల్లోని లౌడ్ స్పీకర్లలో హనుమాన్ చాలీసా పఠనానికి శ్రీకారం చుట్టారు.
శీరామ్ సేన వ్యవస్థాపకుడు ప్రమోద్ ముతాలిక్ సోమవారం ఉదయం 5 గంటలకు మైసూర్‌లోని ఒక ఆలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మసీదుల్లోని లౌడ్ స్పీకర్లలో అజాన్‌కు వ్యతిరేకంగా వెయ్యికిపైగా ఆలయాల్లోని మైకుల ద్వారా హనుమాస్ చాలీసా పారాయణం, సుప్రభాతం, భక్తి గీతాలను ఆలపించినట్లు ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో దీనిని మరిన్ని ఆలయాలకు విస్తరిస్తామని చెప్పారు. మసీదుల్లో లౌడ్ స్పీకర్ల ద్వారా అజాన్ వినిపించడం చట్ట వ్యతిరేకమైనప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు. అందుకే దీనిని వ్యతిరేకిస్తూ ఆలయాల్లో లౌడ్ స్పీకర్ల ద్వారా హన్మాన్ చాలీసాను పఠిస్తున్నట్లు వెల్లడించారు.
మరోవైపు ఈ విషయం తెలిసిన వెంటనే కర్ణాటక పోలీసులు అప్రమత్తమయ్యారు. బెంగళూరులోని ఒక ఆలయంలో లౌడ్ స్పీకర్ల ద్వారా హనుమాన్ చాలీసాను పఠించేందుకు సిద్ధమైన శ్రీరామ్ సేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో మత కలహాలు జరుగకుండా పలు ప్రాంతాల్లో భద్రతను పెంచారు.
#WATCH | Karnataka: Sri Ram Sena workers, led by the organisation's chief Pramod Muthalik, sang Bhajans at 4.55 am this morning at Hanuman Temple in Mysuru.
Earlier, Sri Ram Sena had announced that they will play Hanuman Chalisa on loudspeakers. pic.twitter.com/dAr6RI69JC
— ANI (@ANI) May 9, 2022