తనపై ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేయడంపై కర్నాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ స్పందించారు. తనకు చట్టంపై పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు. అలాగే తనకు న్యాయం కూడా జరుగుతుందన్న పూర్తి విశ్వాసంతోనే వున్నానని ఆయన ప్రకటించారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ రాజకీయ ప్రేరేపితంతోనే జరుగుతున్నాయని డీకే శివకుమార్ ప్రకటించారు.
కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌తో పాటు పలువురిపై మనీలాండింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) చార్జిషీట్ దాఖలు చేసింది. ఐటీశాఖ సోదాల ఆధారంగా ఈడీ నమోదు చేసిన మనీలాండింగ్ కేసులో శివకుమార్ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద 2019లో కాంగ్రెస్ సీనియర్ నేతను ఈడీ అరెస్టు చేశారు. పన్నుల ఎగవేత, హవాలా లావాదేవీల ఆరోపణలపై ఆదాయపు పన్ను శాఖ దాఖలు చేసిన ఛార్జిషీట్ ఆధారంగా 2018 సెప్టెంబర్‌లో ఈడీ శివకుమార్‌తో పాటు ఆయన సన్నిహితులపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.