Dogs Meat | బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్లో శుక్రవారం తీవ్ర గందరగోళం నెలకొన్నది. రాజస్థాన్లోని జైపూర్ నుంచి బెంగళూరు నగరానికి దాదాపు 3 వేల కిలోల మాంసానికి సంబంధించిన పార్సిళ్లు రావడం దుమారం రేపింది.
మటన్ పేరుతో రాజస్థాన్ నుంచి కుక్క మాంసం తీసుకొస్తున్నారని పునీత్ కేకేహళ్లి అనే హిందూత్వ వాది, తన అనుచరులతో కలిసి ఆందోళనకు దిగారు. అయితే పార్సిళ్లను తెప్పించుకొన్న యజమాని మాత్రం అది మటన్ అని వాదించారు. నగరపాలక సంస్థ అధికారులు, పోలీసులు అక్కడకు చేరుకొని, మాంసం నమూనాలు సేకరించారు.