కేటాయించిన శాఖలపై కర్ణాటక మంత్రి ఆనంద్ సింగ్ అసంతృప్తి

బెంగళూరు: తనకు కేటాయించిన శాఖలపై కర్ణాటక మంత్రి ఆనంద్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను కోరిన మంత్రిత్వ శాఖలు దక్కలేదని, పార్టీ ఫోరమ్‌లో తాను చేసిన అభ్యర్థన ఏదీ పరిగణించలేదని ఆయన వాపోయారు. ఎకాలజీ, ఎన్విరాన్మెంట్, టూరిజం శాఖలు తనకు ఇవ్వడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోర్ట్‌ఫోలియోలను తాను కోరలేదన్నారు. సీఎం బసవరాజ్ బొమ్మైను కలిసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. తన అభ్యర్థనను పునఃపరిశీలించాలని సీఎంను కోరుతానని మంత్రి ఆనంద్ సింగ్ తెలిపారు.
కాగా, బీజేపీ ఎమ్మెల్యేలో తనపై అసంతృప్తి నేపథ్యంలో జూలై 27న సీఎం పదవికి యెడియూరప్ప రాజీనామా చేయగా, జూలై 28న కొత్త సీఎంగా బసవరాజ్ బొమ్మై ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం రెండు రోజులకు 29 మంది మంత్రులతో కేబినెట్‌ను ఆయన విస్తరించారు. అయితే తమకు దక్కిన శాఖలపై కొందరు మంత్రులు అసంతృప్తితో ఉన్నారు. ఎకాలజీ, ఎన్విరాన్మెంట్, టూరిజం శాఖల మంత్రి ఆనంద్ సింగ్ తన ఆవేదనను శనివారం బహిరంగంగా వ్యక్తం చేశారు. శాఖల మార్పుపై సీఎం బొమ్మైని కలిసి మాట్లాడతానని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

