బెంగళూరు : బాలికను లైంగిక వేధింపులకు గురి చేసిన ఓ వ్యక్తిని పట్టపగలే నడిరోడ్డుపై నగ్నంగా ఊరేగించారు. ఈ ఘటన కర్ణాటక హసన్ జిల్లాలోని మహారాజ పార్క్ వద్ద చోటు చేసుకుంది. విజయపురా జిల్లాకు చెందిన మేఘరాజ్ జీవనోపాధి కోసం హసన్ సిటీకి కొన్నేండ్ల క్రితం వచ్చాడు.
అయితే మహారాజ పార్క్‌కు రెగ్యులర్‌గా వచ్చే మేఘరాజ్.. అక్కడ ఓ అమ్మాయిని లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఈ విషయాన్ని పార్కుకు వచ్చిన వారు గమనించి, అతన్ని పట్టుకుని చితకబాదారు. అనంతరం నగ్నంగా ఊరేగించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మేఘరాజ్ను అదుపులోకి తీసుకున్నారు.
మేఘరాజ్ను నగ్నంగా ఊరేగించిన నలుగురు వ్యక్తులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే బాధిత బాలిక మేఘరాజ్‌పై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.