Karnataka CM Siddharamaiah | కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లోకాయుక్త పోలీసులు షాక్ ఇచ్చారు. మైసూర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణం కేసులో సీఎం సిద్ధ రామయ్యకు సమన్లు జారీ చేశారు. ఈ నెల ఆరో తేదీన విచారణకు హాజరు కావాలని తెలిపారు. లోకాయుక్త పోలీసులు సమన్లు జారీ చేసిన సంగతిని సీఎం కూడా ధృవీకరించారు.
‘ముడా కేసు విషయమై నాకు లోకాయుక్త నుంచి సమన్లు అందాయి. ఈ నెల ఆరో తేదీన విచారణకు హాజరవుతా’ అని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఇదే కేసులో ఆయన సతీమణి పార్వతిని గత నెల 25న లోకాయుక్త ప్రశ్నించింది. ఇదే విషయమై గతంలో సీఎం స్పందిస్తూ.. రాజకీయ విద్వేషాలకు, కుట్రలకు తన భార్య బాధితురాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.