బెంగళూరు: పరువు నష్టం కేసుల్లో రాజకీయ పార్టీలు విచారణను ఎదుర్కొనవలసిందేనని కర్ణాటక హైకోర్టు చెప్పింది. కంపెనీలు, ప్రభుత్వాలు వంటి వాటికి వ్యక్తిత్వాన్ని ఆపాదించడం సాధారణ విషయమేనని తెలిపింది. ఇటువంటి వాటికి కీర్తి, ప్రతిష్ఠలు ఉంటాయని, అదేవిధంగా, వాటిపై వచ్చే పరువు నష్టం ఆరోపణల్లో విచారణను ఎదుర్కొనవలసి ఉంటుందని వివరించింది. బెంగళూరులోని శివాజీ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ బీజేపీపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. దీనిని సవాల్ చేస్తూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ స్పష్టతనిచ్చింది. అర్షద్పై బీజేపీ చేసిన ట్వీట్లు తీవ్రమైనవిగా కనిపిస్తున్నట్లు తెలిపింది.