బెంగళూరు, నవంబర్ 13: కర్నాటక మాజీ సీఎం యెడియూరప్పకు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనపై నమోదైన పోక్సో కేసులో ట్రయల్ కోర్టు విచారణను కొనసాగించవచ్చని స్పష్టంచేసింది. సాక్ష్యాల మేరకు న్యాయస్థానం కచ్చితమైన రీతిలో విచారణ జరపాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది.
లైంగిక దాడి కేసులో బాధితురాలైన తన మై నర్ కూతురుకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ ఆమె తల్లి 2024 ఫిబ్రవరి 2న యెడియూరప్ప నివాసానికి వెళ్లగా, బాలికపై అసభ్యకరమైన రీతిలో ప్రవర్తించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది.