బెంగళూరు, సెప్టెంబర్ 14: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యెడియూరప్ప, ఆయన కుటుంబ సభ్యులపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించిన ప్రైవేటు ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరపాలని బెంగళూరు అదనపు సిటీ సివిల్ సెషన్స్ జడ్జి ఆదేశాలు జారీచేశారు.
అవినీతి ఆరోపణలపై మరోసారి విచారణ జరపాలని స్పెషల్ కోర్టును కర్ణాటక హైకోర్టు ఆదేశించిన వారం రోజులకు ఈ తీర్పు రావడం గమనార్హం. ఫిర్యాదుదారు టీజే అబ్రహాంకు గవర్నర్ అనుమతి మంజూరు చేయలేదని అంటూ దిగువ కోర్టు ఫిర్యాదును కొట్టివేసింది. అయితే ఫిర్యాదుదారు గవర్నర్ నుంచి అనుమతి పొందాల్సిన అవసరం లేదని హైకోర్టు పేర్కొన్నది.