Karnataka elections | కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి చేనేతలు సరైన బుద్ధి చెప్పారు : పద్మశాలీ సంఘం నేత యర్రమాద వెంకన్న
Yarramada Venkanna | చేనేతల ఆకాంక్షను అవహేళన చేసిన భారతీయ జనతా పార్టీకి కర్ణాటక ఎన్నికల్లో చేనేతలు సరైన బుద్ధి చెప్పారని అఖిల భారత పద్మశాలీ సంఘం చేనేత విభాగం నేత యర్రమాద వెంకన్న అన్నారు. చేనేతపై వేసిన జీఎస్టీ పన్నులు తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గ్రూప్ ఆఫ్ ఫైనాన్స్ మినిస్టర్స్ చైర్మన్ బస్వరాజ్ బొమ్మై పలుమార్లు విజ్ఞప్తి చేసినా పెడచెవిన పెట్టారని ఆరోపించారు.
Karnataka elections | చేనేతల ఆకాంక్షను అవహేళన చేసిన భారతీయ జనతా పార్టీకి కర్ణాటక ఎన్నికల్లో చేనేతలు సరైన బుద్ధి చెప్పారని అఖిల భారత పద్మశాలీ సంఘం చేనేత విభాగం నేత యర్రమాద వెంకన్న అన్నారు. చేనేతపై వేసిన జీఎస్టీ పన్నులు తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గ్రూప్ ఆఫ్ ఫైనాన్స్ మినిస్టర్స్ చైర్మన్ బస్వరాజ్ బొమ్మై పలుమార్లు విజ్ఞప్తి చేసినా పెడచెవిన పెట్టారని ఆరోపించారు. అపాయింట్మెంట్ అడిగితే అవహేళన చేసిన బస్వరాజ్ బొమ్మై కి తగిన గుణపాఠం చెప్పేందుకు గతేడాది అఖిల భారత పద్మశాలీ సంఘం కర్ణాటకలో పని చేస్తుందని, ప్రత్యేక వ్యూహాన్ని అమలుపరిచినట్లు తెలిపారు.
జనవరి 5న జీరో జీఎస్టీ సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కర్ణాటక విధాన సభ కమిటీ హాల్లో చేనేత విభాగం పలు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులతో జీరో జీఎస్టీ ఉద్యమ వార్షికోత్సవ సమావేశం నిర్వహించిందన్నారు. మాజీ ఎంపీ కేసీ కొండయ్య నాయకత్వంలో జరిగిన సమావేశానికి 29 చేనేత కుల సంఘాలు హాజరయ్యాయని, అప్పటి నుంచి కర్ణాటకలో బీజేపీకి తగిన బుద్ధి చెప్పేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని రచించిందన్నారు. పద్మశాలీలు తమ ఓటు ద్వారా బీజేపీకి సరైన జవాబు ఇచ్చారన్నారు.
జీరో జీఎస్టీ ఉద్యమానికి తమ ఓటు ద్వారా మద్దతు పలికిన కన్నడ చేనేతలకు, చేనేత కుటుంబాలకు, మద్దతుదారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చేనేతపై జీఎస్టీ పన్నును తొలగించే వరకు భవిష్యత్తులో దేశవ్యాప్తంగా జరగబోయే అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో ఇదే స్ఫూర్తితో అఖిల భారత చేనేత సంఘం పని చేస్తుందన్నారు. అన్నా హజారే వంటి సామాజిక ఉద్యమకారుడు జీరో ఉద్యమానికి బాసటగా నిలిచారని, ఆగస్టు 7న ఢిల్లీలో చేనేతపై విధించిన జీఎస్టీని తొలగించాలని మహా ప్రదర్శన చేయనున్నట్లు తెలిపారు. 2024లో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జీరో జీఎస్టీ అంశాన్ని జాతీయ ఎన్నికల ఎజెండాగా మార్చనున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం కళ్లు తెరిచి.. చేనేతల ఆకాంక్షలను గౌరవించి.. జీఎస్టీని తొలగించాలన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

