బెంగళూర్ : కర్నాటకలో విద్యుత్ టారిఫ్ల పెంపును నిరసిస్తూ బీజేపీ చేపట్టిన నిరసనలపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) స్పందించారు. వారి (బీజేపీ) నిరసనలను తాను స్వాగతిస్తున్నానని, అసలు ముందు మీ పార్టీ మ్యానిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను గుర్తుకు తెచ్చుకోవాలని కాషాయ నేతలకు డీకే శివకుమార్ సూచించారు.
మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను ముందుగా నెరవేర్చాలని పట్టుబట్టారు. విదేశాల్లో మూలుగుతున్న బ్లాక్ మనీని రప్పించి పేదల ఖాతాల్లో రూ. 15 లక్షలు వేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ ఏమైందని ఆయన నిలదీశారు. ఏటా కోటి ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ ఇచ్చిన వాగ్ధానం ఏమైందని, ఉద్యోగాలు ఎక్కడని డీకే ప్రశ్నించారు.
కాగా కర్నాటకలో 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆయా హామీల అమలుకు నిధులపై తర్జనభర్జనలు పడుతోంది. విద్యుత్ టారిఫ్లు పెంచడంతో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది. పవర్ టారిఫ్ల పెంపునకు వ్యతిరేకంగా పరిశ్రమల సంఘాలు నిరసనలకు పిలుపు ఇచ్చాయి.
Read More :