బెంగళూరు: మహిళలతో అభ్యంతరకరంగా ప్రవర్తించాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక డీజీపీ (సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్) కే రామచంద్రరావుపై కర్ణాటక ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. అభ్యంతరకరంగా ఉన్న ఆయన వీడియో లు వార్తా చానల్స్, సోషల్మీడియా వేదికలపై విస్తృతంగా ప్రసారం కావటాన్ని పరిగణనలోకి తీసుకుకుని క్రమశిక్షణగా ఈ చర్య తీసుకున్నట్టు తెలిపింది.