బెంగళూరు, ఆగస్టు 11: యూపీఏ హయాంలోనే ఓట్ల చోరీ జరిగిందన్న కర్ణాటక కాంగ్రెస్ మంత్రిపై పార్టీ అధిష్ఠానం కన్నెర్ర చేసింది. కర్ణాటక సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్నను రాష్ట్రమంత్రి వర్గం నుంచి తొలగిస్తూ సీఎం సిద్ధరామయ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎం పంపిన సిఫారసు లేఖకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ సోమవారం ఆమోదముద్ర వేశారు. పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీ ఇటీవల ఓట్ల చోరీ అంశం లేవనెత్తుతూ బెంగళూరు లోక్‌సభ పరిధిలోని మహదేవపురా అసెంబ్లీ సెగ్మెంట్‌ను ఉదహరించారు. ఇక్కడ లక్షకుపైగా ఉన్న బోగస్ ఓట్లతో బీజేపీ గెలిచిందని రాహుల్ ఆరోపించారు. దీనిపై మంత్రి రాజన్న స్పందిస్తూ, బోగస్ ఓట్లు, ఓట్ల చోరీ.. నిజానికి కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని అన్నారు.